![]() |
![]() |
.webp)
కుటుంబాలన్నా, ఫామిలీస్ అన్నా చాలా చిరాకు నాకు..కానీ జీ కుటుంబానికి ఎక్సెప్షన్ ఇస్తున్నా అంటూ ఆర్జీవీ కామెంట్ జీ కుటుంబం అవార్డ్స్ వేడుకలో హైలైట్ గా నిలిచింది. ఇక ఈ షోలో తారల్ని చూస్తుంటే ఆకాశం నుంచి దేవకన్యలు వచ్చి ఇక్కడ అవార్డ్స్ తీసుకుంటున్నారా అన్నంత అందంగా మురిసిపోయారు. ఇక ఆల్రౌండర్ అనసూయ "అస్సలేం గుర్తుకు రాదు" అనే సాంగ్ కి మెస్మోరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ చేసింది. తర్వాత అవార్డ్స్ తీసుకోవడం మద్యమద్యలో డాన్సులు వంటివి ఆడియన్స్ ని అలరించాయి.
ఇక ఈ షోకి అనంత శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చారు. "పేపర్ మీద పెన్ను పెట్టకుండా జీవితం అవార్డు తీసుకుంటానని అనుకోలేదు" అంటూ కామెంట్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ ఐన భగవంత్ కేసరి మూవీలో "ఉయ్యాలో ఉయ్యాలో" సాంగ్ రాశారు. అదే ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు ఇక ఇక్కడ జీ స్టేజి మీద అనసూయ కూతురిగా అనంత శ్రీరామ్ తండ్రిగా ఈ సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఇక ఫైనల్ గా మంజుల-నిరుపమ్ పరిటాల స్టేజి మీదకు వచ్చారు.
వాళ్ళు ఈ అవార్డుని అందుకున్నారు. ఇక నిరుపమ్ వాళ్ళ అమ్మను స్టేజి మీదకు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. "మా అమ్మ స్పోర్ట్స్ కోటాలో 70 స్ లో గవర్నమెంట్ లెక్చరర్ గా వర్క్ చేశారు..నన్ను కూడా మా అమ్మ కొన్నేళ్ల క్రితం వరకు ఎందుకు ఈ సీరియల్స్ చక్కగా జాబ్ చేసుకోక..ఆలోచించు" అన్నారు. తర్వాత నిరుపమ్ వాళ్ళ నాన్న ఓంకార్ గారి వీడియోని ప్లే చేశారు. అది చూసిన నిరుపమ్ వాళ్ళ అమ్మ ఎమోషనల్ అయ్యారు. "నన్ను ఈరోజు ఇలా స్టేజి మీద చూసేసరికి ఆయన ఉండి ఉంటె బాగుండేది" అన్నాడు నిరుపమ్.. ఇలా ఈ జీ తెలుగు అవార్డ్స్ షో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆదివారం రాబోతోంది.
![]() |
![]() |